కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి రెండు రాష్ట్రాల ప్రజల్లో కూడా ఉంది. ఏపీ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తెలంగాణా నాయకులు చేసే విమర్శలకు పెద్దగా స్పందించే పరిస్థితి లేకపోవడం కూడా కాస్త విస్మయానికి గురి చేసే అంశంగా చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

శ్రీశైలం జల వివాదంపై మాట్లాడ వద్దని సియం ఆదేశించారని దీనివల్ల కొంత బాదపడ్డాం  అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని జల వివాదాలు పరిష్కరించాలి  అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. రాయలసీమ ఎత్తిపొతల పథకంపై చంద్రబాబు వైఖరి ఏంటో తెలియజేయాలి అని డిమాండ్ చేసారు. ఓటుకు నోటు కేసు వల్ల చంద్రబాబు తెలంగాణ వదిలి రావడం వలన టిఎస్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కట్టిందని అన్నారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనం సహించేది లేదన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp