మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఏమైనా అరెస్ట్  లు ఉంటాయా లేదా అనే దానిపై సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా దీనిపై దుమారం చెలరేగే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వైఎస్ వివేకా హత్యకేసు లో రోజు రోజుకు స్పీడు పెంచుతున్నసిబిఐ బృందం.. కీలక అనుమానితుడు సునీల్ కుమార్ యాదవ్ కోసం సిబిఐ గాలింపు చేపట్టింది.

ఇప్పటికే సునీల్ సమీప బందువు యువరాజ్ ను అదపులోకి తీసుకొని అనంతపురం, కడప జిల్లాలో తిరుగుతూ విచారిస్తున్నది సిబిఐ బృందం. పులివెందుల్లో వారం పది రోజులుగా ఇంటికి తాళం వేసి సునీల్ కుటుంబం కనపడకుండా పోయింది. ఏ క్షణాన్నయినా సునీల్ , డ్రైవర్ దస్తగిరి లను కోర్టు లో హాజరు పరిచే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. దీనితో అనుమాతుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: