తెలంగాణాలో థియేటర్లు రీఓపెన్ కు సన్నద్ధమవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టిప్లెక్స్ ల తెరలు కూడా తెరుచుకోనున్నాయి. ఈ శుక్రవారం ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో సత్యదేవ్ "తిమ్మరుసు", తేజ సజ్జ "ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ" చిత్రాలకు బాగా హైప్ వచ్చింది. ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ రెండు సినిమాలపైనే దృష్టి సారించారు. ఇవి రెండూ కాస్త పేరున్న హీరోల సినిమాలే కాకుండా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు. పైగా సత్యదేవ్ అంటే కంటెంట్ ఉన్న మూవీ గ్యారంటీ అన్న నమ్మకం ఉంది. ఇక తేజ సజ్జ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న యంగ్ టాలెంట్. మిగతా మూడు సినిమాలు చిన్నవే. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఏఎంబి సినిమాస్‌తో పాటు పివిఆర్ సినిమాస్, ఐనాక్స్ వంటి అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు రేపు తెలంగాణలో 100% ఆక్యుపెన్సీతో స్క్రీనింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాయి. కానీ ఆంధ్రాలో మాత్రం ఇంకా థియేటర్ల విషయమై సస్పెన్స్ వీడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: