ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వ‌స్తాయో అర్థం కాకుండా ఉంద‌ని, అందుకే స‌కాలంలో వేత‌నాలు అందేలా చూడాల‌ని ఏడుకొండ‌ల‌వాడిని వేడుకున్న‌ట్లు ఏపీ ఎన్జీవో అధ్య‌క్షుడు బండి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. నాలుగు నెల‌ల నుంచి స‌రైన స‌మ‌యంలో వేత‌నాలు రాక కిరాణా షాపుల ద‌గ్గ‌ర‌, పాల‌వాళ్ల ద‌గ్గ‌ర‌, కూర‌గాయ‌ల ద‌గ్గ‌ర చుల‌క‌న‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 11వ పీఆర్‌సీని వెంట‌నే అమ‌లు చేయాల‌ని, ఉద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని శ్రీ‌నివాస‌రావు డిమాండ్ చేశారు. ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స‌రైన స‌మ‌యానికి వేత‌నాలు ఇవ్వ‌డంలేదంటూ నాలుగు నెల‌లుగా ఆందోళ‌న జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌కు వెళ్ల‌డం, అక్క‌డ నిరాక‌రించ‌డం, మ‌ళ్లీ వేడుకోవ‌డంలాంటివాటితోనే ప‌దోతేదీ వ‌స్తోంది. దీంతో ఒక‌టోతేదీకే జీతాలిచ్చే ప‌రిస్థితి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర క‌న‌ప‌డ‌టంలేదు. వీరితోపాటు పింఛ‌నుదారుల‌కు కూడా స‌రైన స‌మ‌యానికి పింఛ‌ను రావ‌డంలేదంటే పింఛ‌ను రావ‌డంలేద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag