ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నీటి పంప‌కాల నిష్ప‌త్తి చెరి 50 శాతం చొప్పున ఉండాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు రాసిన లేఖ‌లో పేర్కొంది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుకు త్రిసభ్య కమిటీ ఆమోదం లేకుండా అనుమతించకూడద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం పేర్కొంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల విద్యుత్  ఉత్పత్తి చేసుకోవడానికి త‌మ‌కు ఎటువంటి అభ్యంతరం లేద‌ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  బచావత్ ట్రిబ్యునల్ చేసిన 811 టీఎంసీలు గంపగుత్తగా కేటాయించార‌ని తెలిపింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా గ‌తంలోనే ధ్రువీక‌రించింద‌ని, రెండు రాష్ట్రాల మధ్య  పున: కేటాయింపుల అంశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ  జరుపుతున్నందున 2021-22 వాటర్ ఇయర్  నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని కోరింది. బేసిన్ లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతనే బేసిన్ ఆవల ప్రాంతాలకు నీటిని తరలించడానికి అనుమతించాలని విజ్ఞ‌ప్తి చేసింది. కృష్ణా లో వరద ఉన్న కారణంగా అన్ని జల విద్యుత్ కేంద్రాల  నుంచి జల విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో చేయడానికి అనుమతించాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag