కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది. ఇక అంతా మామూలు అవుతుందనే ఆశలు చిగురిస్తున్న వేళ వాటిపై నీళ్లు చల్లుతూ మరోసారి విజృంభిస్తోంది మహమ్మారి. జూలై నెల ఆఖరికి వచ్చే సరికి దేశంలో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అసలు దీనికి అంతమనేదే లేదా ? అనే డౌట్ వస్తోంది. మూడో వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి. తాజా పరిణామాలు చూస్తుంటే వారి హెచ్చరికలు నిజమయ్యేలా కన్పిస్తున్నాయి. దేశంలోనే కాదు రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 





గాంధీ ఆస్పత్రిలో కరోనా వార్డు ఫుల్ అయ్యింది. గాంధీ హాస్పిటల్ కు రోజుకు 50 వరకు సివియర్ కేసులు వస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారం క్రితం వరకు అక్కడ రోజుకు 20 కేసులు మాత్రమే వచ్చేవి. వైద్య, ఆరోగ్యశాఖ మళ్లీ కేసులు పెరుగుతుండడంతో అలర్ట్ అవుతోంది. తెలంగాణలో వరుస పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కేరళలో లాక్ డౌన్ ప్రకటించారు. మళ్ళీ మరోసారి దేశం మొత్తం లాక్ డౌన్ పరిస్థితులు ఎదుర్కొంటుందేమో అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: