డ్రాగ‌న్ ను వ‌ణికిస్తున్న డెల్టా 
ఆగ‌స్టు రాక‌ముందే కొత్త వేరియంట్ ల‌క్ష‌ణాలు అంద‌రినీ ముప్పు తిప్ప‌లు పెడుతోంది. క‌రోనా క‌ట్ట‌డికి ప‌నిచేసే విధంగా రూపొందించిన టీకాల ప‌నిత‌నం అంతంత మాత్ర‌మే అని తేలిపోయింది. చావు ముఖం ప‌ట్ట‌డాన్ని సైతం ఆపు చేయ‌క‌లేపోవ‌డంతో టీకాలపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అమెరికాతో స‌హా కొన్ని దేశాలు క‌రోనా కేసుల న‌మోదులో పోటీప‌డుతున్నాయి. విమానాశ్ర‌యాలను అనుకుని ఉన్న న‌గ‌రాలే ఎక్కువ‌గా బాధిత ప్రాంతాలుగా న‌మోదితం అవుతున్నాయి. ఏదేమైన‌ప్ప‌టికీ రెండు డోసుల టీకా తీసుకున్నా క‌రోనా వ్యాప్తిని మాత్రం అడ్డుక‌ట్ట వేయ‌డం సాధ్యం కాద‌ని తేల్చేసింది తాజా వేరియంట్..ఇప్ప‌టికే ప‌లు దేశాల‌కు డెల్టా వేరియంట్ భ‌యం ప‌ట్టుకుంది. తాజాగా అదే కోవ‌లోకి క‌రోనా పుట్టుక‌కు కార‌ణం అయిన చైనాలో ఈ త‌ర‌హా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో బూస్ట‌ర్ డోస్ కు సిద్ధం అవుతోంది చైనా. నాజింగ్ న‌గ‌రంలో ఈ వేరియంట్ ల‌క్ష‌ణాల‌తో రెండు వంద‌ల కేసులు నమోద‌య్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: