ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టుపై బాలీవుడ్ కమెడియన్ సునీల్ పాల్ స్పందించారు. ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి ఒక పని ఖచ్చితంగా అవసరమని అంటూ ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ పోర్న్ రకరకాల రూపాల్లో మన చుట్టే ఉందని సెన్సార్ లేకపోవడం వల్ల కొంతమంది సినిమా పెద్దలు చాలా దారుణమైన వెబ్ సిరీస్ లు చేస్తున్నారని కుటుంబంతో కలిసి చూడలేని ఆ సిరీస్ ల వల్ల ఎవరికి ఉపయోగం లేదంటూ సునీల్ తెలిపారు. అలాంటి వాటికి ఉదాహరణ గా మనోజ్ బాజ్‌పాయ్‌ మరియు మీర్జాపూర్ సిరీస్ లను పేర్కొన్నారు. వీటివల్ల ఇంట్లో అందరూ కలిసి సినిమా చూడలేని పరిస్థితి వచ్చింది అంటూ పేర్కొన్నారు సునీల్ పాల్. ఇక తనకు తెలిసినంత వరకు మనోజ్‌ బాజ్‌పాయ్‌  ఒక నీచమైన వ్యక్తి అంటూ సునీల్ పాల్ సంచలన కామెంట్స్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: