కరోనా కారణంగా మూతపడిన సినీమా థియేటర్లు ఇప్పట్లో కొలుకునేలా లేవన్నారు తెలుగు ఫిలిం ఛాంబర్ మాజీ సెక్రటరీ ఎన్.వి.ప్రసాద్. ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై విజయవాడలో సమావేశమై కీలకంగా చర్చించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 35 మీదే ప్రధానంగా చర్చ జరిగింది. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే... ప్రభుత్వం మాత్రం కేవలం 5, 10 రూపాయలకే సినిమా చూపించాలని చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వ జీవో వల్ల థియేటర్లు నిర్వహించలేమన్నారు. ప్రస్తుతం సినిమా ప్రదర్శించాలంటే... ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని... చివరికి కరెంట్ బిల్లులు కూడా కట్టలేకపోతున్నామన్నారు. తెలుగు సినిమా ఏపీలో అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. అందుకోసమే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, గుంతకల్లులో తెలుగు ఛాంబర్ గత పెద్దలు పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నారని గుర్తు చేశారు. థియేటర్ల మనుగడను దృష్టిలో పెట్టుకుని ఓటీటీలలో సినిమా విడుదలపై నిర్మాతలు మరోసారి పునరాలోచించాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు ఏపీ సినీ ఎగ్జిబిటర్ల సంఘం సభ్యులు.


మరింత సమాచారం తెలుసుకోండి: