టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం జి.కొండూరు మండలం లో ఆయన పై దాడి జరగడం ఆ తర్వాత పోలీసులు ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం... అదే విధంగా హత్యాయత్నం కుట్ర పూరిత వ్యవహారాలు కింద కేసులు నమోదు చేయడం జరిగింది. నిన్న హనుమాన్ జంక్షన్ లో జడ్జి ముందు...

హాజరు పరచగా నిన్న ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో దేవినేని ఉమా నేడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జి.కొండూరు పిఎస్ లో దాఖలైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్  హైకోర్టు అడ్మిట్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: