ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణ భవన్ లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాల్లో 74 మందిలో కేవలం నలుగురు మాత్రమే తెలంగాణ వారు ఉన్నారన్నారు మాజీ ఎంపీ. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని కొండా గుర్తు చేశారు. పక్క రాష్ట్రంతో గొడవ కారణంగా నీళ్లు పోయాయని కొండా ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలపై పన్నులు పెరిగాయి తప్ప... ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. గతంలో నిరుద్యోగ సమస్య బీహార్, యూపీలో ఉండేదని... కానీ ఇప్పుడు తెలంగాణను నిరుద్యోగ రాష్ట్రంగా పరిగణిస్తున్నారన్నారు. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ లో నియమించిన 75 మంది ఉద్యోగుల కాంట్రాక్ట్ సెప్టెంబర్ నెలతో ముగుస్తుందని...  ఆ తర్వాత కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే... భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: