గత మూడు రోజులుగా సుమంత్ పెళ్లి కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు గా ఒక వెడ్డింగ్ కార్డు కూడా వైరల్ అయ్యింది . దీంతో సుమంత్ మరో పెళ్లి చేసుకోబోతున్నారని అక్కినేని అభిమానులు తెగ సంతోష పడ్డారు. కానీ ఈ విషయంపై తాజాగా నటుడు సుమంత్ స్పందించారు. తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. వైరల్ వెడ్డింగ్ పిక్ తన రాబోయే సినిమాలోని ఒక క్లిప్పింగ్ అని, అది ఎవరో సోషల్ మీడియాలో లీక్ చేసారని తెలిపారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రాబోతుందని తెలిపాడు. అలాగే తన కోసం ఆలోచించే వారందరికీ కూడా సుమంత్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు తన పెళ్లి రూమర్స్ కి చెక్ పెడుతూ సుమంత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: