మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను చట్టాన్ని అతిక్రమించేందుకో.... ఎవరినో మోసం చేయడానికి రాలేదన్నారు. అలుగునూర్ లో జరిగిన బహుజన సమ్మేళనంలో డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. జమ్మికుంటలో ఐదుగురిని అరెస్టు చేస్తే 50 లక్షల మంది వస్తారన్న ప్రవీణ్... ఎంత మందిని అరెస్టు చేస్తారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మేమేమీ టెర్రరిస్టులం కాదు... అక్రమ డబ్బులతో ఫామ్ హోస్ లు కట్టలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్. బహుజన రాజ్యం తీసుకురావడానికి తాను వచ్చానన్న ప్రవీణ్... తన పదవికి రాజీనామా చేసిన తర్వాతే కరీంనగర్ లో తనపై కేసు పెట్టారంటు ఘాటుగా వ్యాఖ్యానించారు.  తనను ఎన్ కౌంటర్ ప్రవీణ్ అంటూ భద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ లో 46 మంది నక్సలైట్లు ఆనాడే ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర తనకు ఉందన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన దళిత సాధికారిత రాష్ట్రంలో ఎక్కడా కనపడలేదంటూ ప్రవీణ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: