సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ మూవీస్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర్నుంచే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సినిమా ఎలా ఉండబోతుంది? షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఎంత వరకు వచ్చింది? వంటి విషయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అయితే కొంత మంది మాత్రం కుతూహలం ఇంకా ఎక్కువ కావడంతో లొకేషన్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఫోన్ల ద్వారా పిక్స్ ను, వీడియోలు తీసి లీక్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సైతం దీనికి అతీతులు కాదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో "అయ్యప్పనుమ్ కోషియం" రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 

కే సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియో లీక్ అయింది. అందులో రానాను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీస్ పాత్రలో ఉన్న పవన్ తన భార్య (నిత్యా మీనన్)తో పోలీస్ స్టేషన్ ముందు బైక్ దగ్గర నిలబడి ఉండడం, రానా వెళ్తూ వెళ్తూ వారిద్దరిని హెచ్చరించడం సీన్ లో కనిపిస్తోంది. ఈ సీన్ చూసిన పవన్ అభిమానులు థియేటర్లో అయితే ఈలలు వేయడం ఖాయం. అందులో రానా నటన ఒళ్ళు గగుర్పొడిచేలా అద్భుతంగా ఉంది. ఇలాంటి సీన్ కు సంబంధించిన వీడియో లీక్ కావడం దురదృష్టకరం. ఇక ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: