సంచలన నటి షకీలా అనారోగ్యంతో చనిపోయిందంటూ నెట్టింట్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలపై తాజాగా షకీలా స్పందించింది. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. ఆ వీడియో ద్వారా ఆమె మాట్లాడుతూ "అందరికీ నమస్కారం. నేను మీ షకీలా... నేను ఇక లేనంటూ కొన్ని వార్తలు వచ్చాయి అని విన్నాను. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఇక్కడే ఉన్నాను. చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అని మీరు అనుకోవచ్చు. 

కొంతమంది నా గురించి బ్యాడ్ న్యూస్ లేదా సాడ్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలామంది ఫోన్ చేశారు. నా ఆరోగ్యం గురించి అనుకుంటున్నారు. మీ అందరి నుంచి వచ్చిన ప్రేమకు ధన్యవాదాలు. న్యూస్ ప్రచారం చేసిన వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వారి వల్లే అందరి దృష్టి నా వైపు మళ్ళింది" అంటూ వివరణ ఇచ్చింది. అది మరణించింది అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారిపై కూడా షకీలా పాజిటివ్ గా స్పందించడంపై, ఇక సీరియస్ న్యూస్ ను కూడా ఇంత ఈజీగా తిప్పి కొట్టడంపై ఆమె అభిమానుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: