ఫ్యాక్ట్ ఫైండింగ్ : అక్రమ మైనింగ్ పై టీడీపీ  యుద్ధం

టీడీపీ నేత దేవినేని ఉమ పై వైసీపీ వ‌ర్గీయుల దాడి అనంత‌రం ఆ పార్టీ మ‌రింత ప‌ట్టుబిగించింది. దీనిపై మ‌రింతగా లోతైన అధ్య‌యనం చేయాల‌ని భావిస్తోంది. నిజానిజాలు తేల్చి న్యాయ పోరాటం చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌ వుతున్న త‌రుణాన పార్టీకి సంబంధించి ప‌ది మంది సీనియ‌ర్ నాయ‌కుల‌తో కూడిన నిజ నిర్థార‌ణ క‌మిటీ ని నియ‌మించి, క్షేత్ర స్థాయి వివ‌రం తెలుసుకునేందుకు, అక్క‌డ చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై వైసీపీ ప్ర‌భుత్వం చెబుతున్న వాటిలో వాస్త‌వాలేంటో వెల్ల‌డి చేసేందుకు వీరంతా స‌మాయ‌త్తం అవుతున్నారు. ఇందుకు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి..
 
కొండ‌ప‌ల్లి మైనింగ్ వ్య‌వ‌హారంపై నిజానిజాలు తేల్చేందుకు వెళ్లిన టీడీపీ లీడ‌ర్ దేవినేని ఉమ‌పై దాడి జ‌రిగిన నేప‌థ్యంలో ఆ పార్టీ ఇదే అంశం పై మ‌రింత ఉద్య‌మించాల‌ని నిర్ణయించింది. ఈ మేర‌కు ప‌దిమంది స‌భ్యుల‌తో కూడిన నిజ నిర్థార‌ణ క‌మిటీని నియ‌మి స్తూ..తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇందులో సీనియ‌ర్ నాయ కులు వ‌ర్ల రామ‌య్య‌, మాజీ మంత్రి నక్కా ఆనం ద‌బాబు, వంగ‌ల‌పూడి అనిత‌, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, బోండా ఉమామ‌హేశ్వ ర‌రావు, కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, నెట్టెం ర‌ఘురాం, న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి, తంగిరాల సౌమ్య‌, నాగుల మీరా ఉన్నారు. వీరంతా త్వ‌ర‌లో కొండ‌ప‌ల్లి రిజ‌ర్వు ఫారెస్టుకు ఆనుకుని జ‌రుగుతున్న అక్ర‌మ మైనింగ్ కు సంబంధించి క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి సంబంధిత నివేదిక‌ను అధినేత చంద్ర‌బాబుకు అందించ‌నున్నారు. మ‌రోవైపు దేవి నేని ఉమ‌కు బెయిల్ మంజూరు చేయా ల‌ని కోరుతూ ఆయ‌న తర‌ఫు న్యాయ‌వాదులు హై కోర్టులో పిటిష‌న్ ను మూవ్ చేశారు. కృష్ణా జిల్లా, జి. కొండూరు పోలీసులు త‌మ క్లైట్ ఉమ పై బ‌నా యించిన‌వ‌న్నీ అక్ర‌మ కేసులేన‌ని, వీటికి ఎటువంటి ఆధారాలు లేవ‌నీ కోర్టుకు విన్న‌వించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: