పొలిటిక‌ల్ వార్ : "మా" పోరుకు మేం సిద్ధం

ఎవ‌రు గెలుస్తారో కానీ ముందు నుంచి మొద‌ల‌యిన హ‌డావుడికి కాస్త రిలీఫ్ ఇస్తూ సీనియ‌ర్ న‌టుడు రెబ‌ల్ స్టార్ ఓ తీపి క‌బురు చెప్పారు. ఈ సారి ఎన్నిక‌ల ఎప్ప‌టిలానే వివాదాల‌కు నెల‌వుగా మారిన‌ప్ప‌టికీ సంబంధిత ప్ర‌క్రియ ఎప్పుడు నిర్వ‌హించేది తేల్చేశా రు. ఏదేమైన‌ప్ప‌టికీ ఎట్ట‌కేల‌కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల‌కు మార్గం సుగ‌మం అయింది. సెప్టెంబ‌ర్ 12న ఎన్ని క‌ల నిర్వ‌హ‌ణ‌కు ము హూర్తం నిర్ణ‌యించారు. ఈ మేర‌కు క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం త‌ర‌ఫున సీనియ‌ర్ న‌టులు కృష్ణం రాజు ఓ నిర్ణ‌యం వెలువ‌రించార‌ని స‌మా చారం. ఇప్ప‌టికే కార్య‌వ‌ర్గం ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఇటీవ‌ల కార్య‌వ‌ర్గ స‌భ్యుల బృందం ఓ లేఖ రాసిం ది..క్ర‌మ‌శిక్ష‌ణ సంఘాని కి..దీని ప్ర‌కారం స్పం దించిన కృష్ణంరాజు ఎన్నిక‌ల‌కు తేదీని నిర్ణ‌యించారు. దీంతో సినిమా ప‌రిశ్ర‌మలో త్వ ర‌లోనే మ‌రింత ఎన్ని క‌ల వేడి రాజుకోనుంది. ప్ర‌కాశ్ రాజ్ మొద‌లుకుని మంచు విష్ణు దాకా అంతా అధ్య‌క్ష బ‌రిలో తామంటే తాము ఉంటామ‌ని చెబుతుండ డంతో ఎప్పుడు ఏ ప్ర‌క‌ట‌న రానుందో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ ను మా అధ్య‌క్షురాలిగా ఏక‌గ్రీవంగా ఎన్నుకునేందుకు సైతం కొన్ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ప్ర‌కాశ్ రాజ్, మంచు మ‌నోజ్, సీవీఎల్ న‌ర‌సింహారావు, హేమ‌, జీవితా రాజ‌శేఖ‌ర్ ఈ సారి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నామ‌ని చెబుతున్నారు. ఎవ‌రు గెలిచినా  ఓడినా స‌గ‌టు సినీ న‌టుడికి ద‌క్కే ప్ర‌యోజ‌నం ఏమీ లేక‌పోయినా ఈ గొడ‌వలు మాత్రం ఎప్ప‌టిలానే ఓ వినోద ప్ర‌క్రియ‌గా మిగిలిపోవ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: