గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుపై సీపీఎం నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఆస్తి ప‌న్ను పెంచ‌డంతోపాటు చెత్త‌పై ప‌న్ను వేయ‌డాన్ని నిర‌సిస్తూ స‌త్తెన‌ప‌ల్లి పుర‌పాల‌క సంఘ కార్యాల‌యంలో నిర‌స‌న తెలియ‌జేశారు. సత్తెనపల్లి  ఎమ్మెల్యే అంబటి రాంబాబు పై సిపిఎం నేతలు పోలీసులకు ఫిర్యాదు. కౌన్సిల్‌హాల్‌కు వెళ్లే మెట్ల‌మార్గం ద‌గ్గ‌ర అడ్డంగా కూర్చొని నిర‌స‌న తెలియ‌జేస్తుండ‌గా వారంద‌రినీ దాటుకుంటూ అహంకార‌పూరితంగా అడ్డంగా కూర్చున్న‌వారిని తొక్కుకుంటూ ఎమ్మెల్యే అంబ‌టి ముందుకు వెళ్లారు. అలా ముందుకు వెళుతూ ఒక మ‌హిళా కార్య‌క‌ర్త చేతిని కూడా తొక్కుకుంటూ వెళ్లారు. ఆమె చేతికి తీవ్ర గాయాల‌వ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై పార్టీ కార్య‌క‌ర్త‌లు స‌త్తెన‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో అంబ‌టిపై ఫిర్యాదు చేశారు. పుర‌పాల‌క సంఘ కార్యాల‌యం వ‌ద్ద‌, పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద అంబ‌టి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంబ‌టి వివాదాస్పదంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఇదేమీ తొలిసారి కాదు. గ‌తంలోకూడా ప‌లు సంద‌ర్భాల్లో అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేసేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag