భారీ వర్షాల కారణంగా నీటి మట్టం అమాంతం పెరిగిపోయిన గోదావరి ప్రస్తుతం శాంతిస్తుంది. గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. అయితే దేవీపట్నం మండలం లో ఇళ్లలో ఇప్పటికీ వరద నీరు నిలిచే ఉంది. పూడిపల్లి, తోయ్యేరు, దేవీ పట్నం, పోశమ్మ గండి గ్రామాలు వరదముంపులోనే ఉన్నాయి. మరోవైపు కొండ మొదలు పంచాయతీలోని కొన్ని గ్రామాలలో ఆలయం తో పాటు ఇళ్లన్నీ వరద నీటిలోనే ఉన్నాయి.

వీర వరం, తొయ్యేరు రహదారిపై వరద ఉదృతి కొనసాగుతూనే ఉందటం తో రాకపోకలు నిలిచిపోయాయి. అంతే కాకుండా సీత పల్లి వాగుపై ఇప్పటికీ వరద నీరు తగ్గలేదు. వరదలతో పలు గ్రామాల్లో బురద మరియు చెత్త చెదారాలు కొట్టుకుని వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రజలను మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: