రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దళిత బంధు పథకాన్ని హుజరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేబినెట్ మీటింగ్ లో ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..

ఇప్పటికే దళిత బంధు పథకం పై పలు దఫాలుగా సర్కార్ చర్చించింది. అందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించడం... వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం.. బడ్జెట్ లాంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా దళితవాడల్లో ఉన్న సమస్యలు, అర్హుల జాబితా, తదితర అంశాలను చర్చించనున్నారు. మరోవైపు కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ ప్రకటించిన చేనేత బంధు పై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా హుజూరాబాద్ ఎన్నికల వేళ ప్రభుత్వం పై కోపంతో ఉన్న విద్యార్థులను చల్లార్చేందుకు 50 వేల ఉద్యోగాల భర్తీ పై కూడా ఈ మీటింగ్ లో చర్చించబోతున్నట్టు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: