చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏదైనా కారణంతో మరణిస్తే వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం ఒకదానిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రైతు ఏదైనా కారణంతో మరణిస్తే ఆయన నామిని బ్యాంక్ అకౌంట్ లో ఐదు లక్షలు ప్రభుత్వం తరఫున డబ్బు జమ చేస్తున్నారు. 



అయితే ప్రస్తుతం ఈ పథకం రైతులకు మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలోనే ఈ పథకాన్ని చేనేత కార్మికులు సైతం అమలు పరిచేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిజానికి చాలా రోజుల క్రితమే ఆయన ఈ పథకాన్ని ప్రకటించగా తాజాగా ఈ పథకం గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. త్వరలోనే ఈ పథకం విధివిధానాలు ఖరారు చేసి ప్రారంభిస్తామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: