హైదరాబాద్ లో మందుబాబులకు ఊహించని షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే హైదరాబాద్ లో ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు మద్యం షాపులు పూర్తిగా మూత వేస్తున్నట్లు తెలుస్తోంది.  సాధారణంగా హోలీ వంటి పండుగల నేపథ్యం లో ఇలా హైదరాబాద్ లో మద్యం షాపులు మూసి వేసే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో పాతబస్తీ బోనాలు జరుగుతున్న ఆదివారం నాడు అలాగే ఆ మరుసటి రోజు కూడా బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు మద్యం దుకాణాలు కూడా మూసి వేయనున్నట్లు తెలంగాణ ఆబ్కారీ శాఖ అధికారులు తాజా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఏడాది ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని అదే సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి మద్యం దొంగచాటుగా విక్రయిస్తే ఆ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా శాఖ అధికారులు వెల్లడించారు. కల్లు దుకాణాలు సహా బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు ఇలా అన్ని మద్యం దొరికే స్థావరాల మీద తమ ఫోకస్ ఉంటుందని వారు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: