మిజోరాం పోలీసులు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై హత్యాయత్నం మరియు నేరపూరిత కుట్ర ఆరోపణలపై జూలై 26 న అంతరాష్ట్ర సరిహద్దులో ఇటీవల జరిగిన ఘర్షణలకు సంబంధించి కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రితో పాటు, నలుగురు అస్సాం పోలీసు ఉన్నతాధికారులు, ఇద్దరు బ్యూరోక్రాట్లు మరియు 200 మంది గుర్తు తెలియని అస్సాం పోలీసు సిబ్బందిపై కేసులు నమోదు చేసారు.

జులై 26 న మిజోరాం పోలీస్ ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో, నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఆయుధాల చట్టం మరియు మిజోరామ్ కంటైన్‌మెంట్ మరియు కోవిడ్ -19 చట్టం 2020 కింద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. పోలీసు శిబిరాన్ని "బలవంతంగా ఆక్రమించుకోవడానికి" ప్రయత్నించారని దీనిని రిజర్వ్ ఫారెస్ట్ ఆక్రమణ అని మిజోరాం పోలీసులు ఆరోపించారు.

మిజోరాం బిఒపిని బలవంతంగా ఆక్రమించి శిబిరాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో అస్సాం పోలీసు బృందం 20 వాహనాలతో పాటు గుడారాలు మరియు ఇతర సామగ్రితో సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగ శుక్రవారం మాట్లాడుతూ, అసోం పోలీసులే మొదట కాల్పులు జరిపారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: