ఈటెల ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా!

రాజ‌కీయంలో రాజ‌కీయం మాత్ర‌మే
ఉండాలి ఉంటుంది కూడా
కానీ కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నం
తాను దిగివ‌చ్చిన దాఖ‌లాలూ ఉన్నాయి
అలా త‌న దోస్తు క్షేమ స‌మాచారం తెల్సుకున్న
ఆయ‌న కాస్త తేట ప‌డ్డారు.
ఆ వివరం ఇది

ప్రజా యుద్ధంలో అలుపెరుగ‌క శ్ర‌మించడంతో ఈటెల రాజేంద‌ర్ కాస్త అల‌సిపోయారు. దీంతో ఆయ‌న పాద యాత్ర‌కు బ్రేకులు పడ్డాయి. కొంత ప్ర‌చారం జోరూ, హోరూ కూడా త‌గ్గాయి. ఈటెల‌తో పాటే బీజేపీ శ్రేణులూ నిరుత్సాహంలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఈటెల ఎక్క‌డున్నారు...జూబ్లీహిల్స్ అపోలోలో చికిత్స‌పొందున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంది.? నిల‌కడ‌గానే ఉంది. ఆయ‌న ప్ర‌జా దీవెన పాద యాత్ర ఆగిపోయి, కొంత నిరాశ మిగిల్చిన త‌రుణాన ఈటెల ఆస్ప‌త్రిలో ఉండ‌డంలో చూసి శ్రేణులే కాదు కేసీఆర్ కూడా బాధ‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఒక‌నాటి క్యాబినెట్ సహ‌చ‌రుడు ఆరోగ్యం గురించి వాక‌బు చేశార‌ని తెలుస్తోంది. హు జురాబాద్ లో 222 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసిన ఈటెల త‌రువాత పూర్తి అస్వస్థ‌త కు లోన‌యిన విష‌యం విధిత‌మే! ఈ నేప థ్యంలో ఆయ‌న బాధ్య‌త ఎవ‌రు తీసు కుంటారు. లేదా హుజురాబాద్ ఎన్నిక వాయిదా అవుతుందా అన్న‌వి ఇప్పుడు వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు. ఇవాళ ఈటెల ను ప‌రామర్శించి ఆయ‌న కుటుంబానికి ధైర్యం చెప్పిన వారిలో బీ జేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్, మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: