మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్ గేమ్‌ లో రూ. 40,000 కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఛతర్‌పూర్ శాంతి నగర్‌లో తన కుటుంబంతో కలిసి ఉండే బాలుడు తన తల్లిదండ్రులకు తెలియకుండా గత కొన్ని రోజులుగా ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్ అనే ఆన్‌లైన్ వార్ రాయల్ గేమ్ కోసం రూ. 40,000 ఖర్చు చేయడం గమనార్హం.

తన తల్లి ఖాతా నుంచి 1500 డెబిట్ కాగా బాలుడ్ని పిలిచి నిలదీసి అడగగా... తాను ఖర్చు చేసానని ఒప్పుకుని ఇంట్లో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఒక సూసైడ్ నోట్ కూడా రాసాడు. తాను ఈ గేమ్ కోసం 40 వేల రూపాయలు ఖర్చు చేశా అని అందులో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: