ఏ కుటుంబానికి అయినా ఇంటి పెద్దగా ఆ ఇంటి పెద్ద వాళ్ళు ఉంటారు. కానీ కొంత మంది కక్కుర్తి పడి ఆస్తులు ఉన్న, కార్లు, బంగ్లాలు ఉంటె తెల్ల రేషన్ కార్డు రాదు అనే ఉద్దేశం తో ఆ ఇంటి చిన్నారుల పై న రేషన్ కార్డులను పొందారు. ఈ తతంగం అంత కూడా నిజామాబాద్ జిల్లా లో జరిగింది. ఇక నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో ఏకంగా ఐదేళ్ల చిన్నారుల పేరు మీద రేషన్ కార్డులు ఉండటం పలువురు అధికారులను విస్మయాని కి గురి చేస్తుంది. రేషన్ కార్డు అక్రమాల పై విచారణకు సైతం అధికారులు వెళ్లలేని పరిస్థితి అక్కడ కనిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు. పలుకుబడి ఉన్న కొంత మంది మండల స్థాయిలో అధికారులను ఎలాంటి విచారణ జరగనివ్వకుండా మాయ చేస్తున్న విషయం తాజాగా బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: