ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పక్క రాష్ట్రం నుంచి ఏపీ కి వలస వచ్చిన కొంత మంది కూలీలకు సహాయం చేసారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాలో ఆక్వా చెరువుల వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 6 గురు మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ స్పందించారు. చనిపోయిన వలస కూలీలా కుటుంబాలకు ప్రతి ఒక్కరు చొప్పున 3 లక్షల చొప్పున ఎక్సగ్రేషియా అందచేయనున్నట్టు ప్రకటించారు. ఒడిశా కి చెందిన కూలీలయినప్పటికీ కేవలం మానవీయ కోణంలో ఆలోచించి ఈ నష్ట పరిహారం అందిస్తున్నట్టు జగన్ తెలిపారు. ఆక్వా చెరువుల యాజమాన్యం నుంచి కూడా ప్రతి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని అధికారులకు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసారు

మరింత సమాచారం తెలుసుకోండి: