కొరియర్ లాజిస్టిక్స్ ఈకామర్స్ కంపెనీలతో భారీ మోసం జ‌రిగింది. సిప్రొ కంపెనీ పేరు తో బిజినిస్ మొదలు పెట్టి తెలుగు రాష్ట్రాల‌లో ప‌లువురిని మోసం చేశారు. సిప్రొ ఎండీలు న‌రేంద్ర భేటి, సంతోష్ ప‌ర్వాల్ సిప్రొ కంపెనీ ఫ్రాచైసెస్ పేరుతో యూనిట్ మెంబ‌ర్స్ ను మోం చేశారు. ఫ్రాంచైసెస్ యూనిట్ కోసం డ‌బ్బులు చెల్లించ‌గా వాటిని జ‌ల్సాల కోసం ఖ‌ర్చు చేశారు. రెండు రాష్ట్రాల్లో 12 ఫ్రాంచైసెస్ ల‌కు డ‌బ్బులు తీసుకున్నారు. డ‌బ్బులు జ‌ల్సా చేసి ఖ‌ర్చు చేసిన అనంతరం ఇద్ద‌రు ఎంపీల మధ్య గొడ‌వ జ‌రింగింది. దాంతో కంపెనీ మూసివేశారు. మ‌నీ ఎక్స్ ప్రెస్ ప్రేవేట్ లిమిటెడ్ తో మ‌రో బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. దాని ద్వారా 98 ఫ్రాంచైసెస్ ల‌ను ఏర్పాటు చేశారు. 

దాంతో ఎంఎన్ ఆర్ కంపెనీకి యూనిట్ స‌భ్యులు 60ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను చెల్లించారు. మ‌నీ ఎక్స్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగుల‌కు కూడా జీతాలు ఎగ్గొట్టారు. ఎన్ని సార్లు అడిగినా ఎండి నరేంద్ర భేటి ఎండీ న‌రేంద్ర భేటీ దీనిపై స్పందించ‌డంలేదని చెబుతున్నారు. నరేంద్ర బేటి భార్య రాణి సిద్ధుల అనే కంపెనీ యజమానులకు, వ్యతిరేకంగా బోడుప్పల్ ఎంఎన్ఆర్ కంపెనీ ఎదుట ఎంఎన్ ఆర్ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. తాము తీసుకొచ్చిన ఫ్రాంచైసెస్ వారికి, మ‌రికు ఉద్యోగుల కు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: