రేపు ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద నీరు వస్తున్న నేపధ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండి పోవడంతో వరద నీటిని అధికారులు కిందకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉంది. కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ... జగ్గయ్యపేట నుంచి అవనిగడ్డ వరకు గల నది పరివాహక అధికారులను ను అప్రమత్తం చేసాం అని పేర్కొన్నారు.

వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని వివరించారు. రేపు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజల తోపాటు లంకల్లో వుండే వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేసామని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: