గ‌జ‌నీ పాత్రలో సంజ‌య్ ?
ప‌స్తులుంటే విజ‌యాలు
విజ‌యాలు స్మ‌రిస్తే
గొప్ప‌నయిన జ్ఞాపకాలు
వ‌స్తాయి వ‌రిస్తాయి

కానీ..
మ‌న టీబీజేపీ నేనే అంత అనే
మాటే వేదం అయిపోయింది
వారికి మీరాచానూ తెలియ‌దు
పీవీ సింధు తెలియ‌దు
విజ‌యం అంటే పోలింగ్ బూతులో గెలుపు కాద్సార్
ఈ దేశం ఆత్మ గౌర‌వాన్ని వినువీధుల‌లో చాట‌డం
మీరు ఆ ప‌ని చేయ‌డం మ‌రిచిపోతే దేశం క్ష‌మించదు
నేను జెండాను కాను స‌ర్ కానీ దాన్ని మోసే భుజాన్ని నేను
మీరు భుజాన్ని గుర్తించ‌క భుజ కీర్తుల‌నే న‌మ్ముకుంటున్నారు
అని స‌గ‌టు కార్య‌కర్త బాధ‌ప‌డేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు వీళ్లు....

విశ్వ క్రీడ‌ల్లో విజేత‌లుగా నిలిచిన వారి పేర్లు ఆయ‌న మ‌రిచిపోయారు. మోడీ మ‌హాన్ అన‌డం కాదు భార‌త్ మ‌హాన్ అని అనండి అని చెప్పారొక‌రు. ఇంత‌కూ దేశభ‌క్తి త‌గ్గిపోయిన ఆ నాయ‌కుడి పేరు ఏంటో తెల్సా? ఆయ‌నే టీ బీజేపీ బాస్ బండి సంజ‌య్. ఏం చేస్తున్నార‌క్క‌డ? మీకు యువ‌త ప‌ట్ట‌దా? లేకా వారి విజ‌యాలు మీకు వంటికి ప‌ట్ట‌వా? అంటూ హై క‌మాండ్ ఇవాళ సీరియ‌స్ అయింది. అయినా మ‌న నాయ‌కులకు ఇవి ప‌ట్ట‌వు.. స్వేద వేదాలు ప‌ట్ట‌వు.. చెమ‌ట గంధాల వెల్లువ ప‌ట్ట‌దు.. ప‌ట్టెడు మెతుకులు  అందించిన ఆత్మ‌విశ్వాస‌మూ ప‌ట్ట‌దు... కేవ‌లం త‌మ‌ని తాము నిర్మించుకునే ధ్యాసే త‌ప్ప ఇత‌రుల విజ‌యాల‌ను గుర్తించే గౌర‌వించే ప‌ద్ధ‌తే ప‌ట్ట‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: