జ‌న‌సేన ఫైట్ : ఇదేం అతిథి మ‌ర్యాద..జీతాలే లేవు సారూ..
guest lecturers wants to clear their dues request to ap cm

వేద‌న నిండిన స్వ‌రాల‌కు
బాస‌ట‌గా నిలిచిన గొంతుక‌లు కావాలి

ఇవి జ‌గ‌న్ ఇచ్చిన హామీలంటే
ఒప్పుకోరు కానీ మా బ‌తుకులు దిద్దేందుకు
ఒకే ఒక్క భ‌రోసా అయినా ప్ర‌భుత్వం ఇస్తే మేలు

ఇలాంటివి ఎన్నో మీరు మ‌రిచిపోయారు
ఇప్పుడు మ‌మ్మ‌ల్నీ మ‌రిచి పోండి సీఎం సారూ!
అంటూ ఆ అతిథి అధ్యాప‌కులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు

ఆక‌లి బాధ‌ల‌కూ బ‌తుకు బాధ‌ల‌కూ అంతులేని స‌మ‌యాన
జ‌న‌సేన త‌ర‌ఫున మద్ద‌తు అందించాల‌ని వేడుకుంటూ
ఇవాళ ఆ సంఘం పెద్ద‌లు నాదెండ్ల ను క‌లిశారు ఆ వివ‌రాలివి

గత కొద్ది నెల‌లుగా జీతాలు లేవు..నాడు పాద‌యాత్ర‌లో మ‌మ్మ‌ల్ని రెగ్యుల‌రైజ్ చేస్తామ‌న్న మాట‌కు ఈనాటికీ అమ‌లు లేదు. మాట‌కూ చేత‌కూ పొంత‌న లేదు..అంటూ ఆవేద‌న చెందారు గెస్ట్ లెక్చ‌ర‌ర్లు. ఈ నేప‌థ్యంలో త‌మ త‌ర‌ఫున పోరాడాల‌ని, త‌మ పోరాటాల కూ మ‌ద్దతు అందివ్వాల‌ని కోరుతూ ఆ సంఘం జ‌న‌సేన పార్టీ పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ను కోరింది. ఈ మేర‌కు ఆయన ను క‌లిసి విన‌తి ప‌త్రం అందించింది. త‌మ‌కు గంట‌లు లెక్క చెల్లించాల్సిన వేత‌నాలు ప‌దివేలు లోపే ఉంటాయ‌ని, ఆ కొద్దిపాటి జీతాన్నీ చెల్లించేందుకు సీఎం కు మ నసు రావ‌డం లేద‌ని వాపోయింది. వీరి వేద‌న విన్న నాదెండ్ల స్పందిస్తూ వేత‌న బ‌కాయిల చెల్లింపు త‌క్ష‌ ణ‌మే ప్ర‌భుత్వం స్పందించాల‌ని కోరారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల‌నే ఈ ప్ర‌భుత్వం పునరావృతం చేస్తుంద‌ని మండి ప‌డ్డారు. ఇప్ప‌టికైనా వీరికి న్యాయం చేయాల‌ని కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: