టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి రేవంత్ రెడ్డి మరియు నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహేశ్వర్ రెడ్డి తమకు సమాచారం ఇవ్వకుండా ఇంద్రవెల్లి లో సభ ఎలా ప్రకటిస్తారని అని ప్రశ్నించారు. దాంతో ఇంద్రవెల్లి కి మీకు సంబంధం ఏమిటని నిర్మల్ కే పరిమితం కావాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.

దాంతో మీటింగ్ లో పాల్గొన్న సీనియర్ నాయకులు కలగజేసుకుని సర్ది చెప్పారు. ఇదిలా ఉండగా ముందునుండి రేవంత్ రెడ్డి పై పలువురు సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా పీసీసీ పగ్గాలు చేపట్టిన అనంత్రం రేవంత్ పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకుపోతాను అని చెప్పి ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సున్నితంగా బదులు ఇవ్వకుండా ఘాటుగా స్పందించడంతో చర్చనీయాంశంగా మారింది. దాంతో రేవంత్ దూకుడు తగ్గించుకుంటే మంచిది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: