పదవుల్లో ఉన్న వాళ్ళను తమ కుటుంబ సభ్యులు ఏం చేసినా వెనకేసుకుని వస్తారు. తమ వారి పాలన పై పొగడ్తల వర్షం కురిపిస్తారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ తన అన్న పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్లాస్ నగర్ లో ఒక సదస్సుకు ప్రహ్లాద్ మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిఎస్టిని చెల్లించకూడదని ఆయన వ్యాపారస్తులకు సూచించారు. మోడీ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు... వారు మీ సమస్యలను వినాలి. అంటూ వ్యాపారవేత్తలకు సూచించారు.

మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నామని, బానిసలం కాదని అన్నారు. జిఎస్టి చెల్లించం అని మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యాపారస్తులు అందరు లేఖ రాయాలని పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మోడీ సొంత తమ్ముడు ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా జిఎస్టి తో వ్యాపారస్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టేట్ జిఎస్టి, సెంట్రల్ జిఎస్టి పేరుతో వ్యాపారస్తుల నుండి పన్నులు వసూలు చేయడంతో ప్రజలపై కూడా బారం ఎక్కువైపోయింది. ఇక ఇప్పుడు మోడీ విధానాలు ఆయన సొంత తమ్ముడికే నచ్చలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: