టోక్యో ఒలంపిక్స్ పురుషుల హాకీ సెమీఫైనల్ లో ప్రపంచ ఛాంపియన్లు బెల్జియం పై 5-2 తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ ఆటలో రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెండ్రిక్ హ్యాట్రిక్ సాధించాడు. అంతేకాకుండా లాయిక్ లూపర్డ్ మరియు జాన్ జాన్ డొమినిక్ కూడా వరుసగా రెండవ సారి ఒలంపిక్స్ ఫైనల్ కు వెళ్లేందుకు కృషి చేశారు. బెల్జియం చేతిలో ఓడిపోవడంతో స్వర్ణం గెలిచే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.

దాంతో భారత్ కాంస్య పథకం కోసం ఆడనుంది. బెల్జియం ఫైనల్లోకి ప్రవేశించిన రోజునే భారత్ కాంస్య పథకానికి సంబంధించిన ఆటను ఆగస్టు 5న ఆస్ట్రేలియా మరియు జర్మనీ ల మధ్య గెలిచిన విజేత టీమ్ తో తలపడనుంది. ఇది ఇలా ఉండగా భారత పురుషుల హాకీ జట్టు పై ఎన్నో ఆశలు ఉండేవి. ఈ ఏడాది హాకీలో స్వర్ణం సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ బెల్జియం తో ఓడిపోవడం తో ఇప్పుడు కాంస్యం కోసం పోరాడవలసి వస్తుంది. మరోవైపు భారత షట్లర్ సింధు కూడా స్వర్ణ పతకాన్ని మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే మీరాబాయి చాను కూడా వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణాన్ని మిస్ చేసుకుంది. ఇప్పుడు హాకీ జట్టు సైతం స్వర్ణ పథకాన్ని దూరం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: