తాడిపత్రిలో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు నిన్న ఉదయం నుంచి మున్సిపల్ ఆఫీస్ లోనే చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మకాం వేశారు. అధికారులతో సమావేశం నిర్వహించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో అధికారులు కలవకుండా అధికారులను మరో సమావేశానికి తీసుకువెళ్లారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే మున్సిపల్ అధికారులను కలవకుండా ఇంటికి వెళ్ళేది లేదు అంటూ నిన్న ఉదయం నుంచి మున్సిపల్ ఆఫీస్ లోనే చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మకాం వేశారు. 



ఇక నిన్న సాయంత్రం కొందరు అధికారులు జెసి చెప్పిన సమయానికి రావడంతో వారి నిబద్ధతతో మెచ్చుకుంటూ మోకాళ్ళ మీద నిలబడి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి వారికి నమస్కారం చేశారు. ఇక మీటింగ్ కి రాని 26 మంది అధికారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. మరోపక్క ఈ ఒత్తిడి భరించలేక మున్సిపల్ కమిషనర్ సెలవు మీద వెళ్లిపోయారు ఆయన తన స్థానంలో ఒక ఇన్చార్జి నియమించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు తాడిపత్రిలో టెన్షన్ పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

jc