అమరావతిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన వారికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. భూ సమీకరణ చట్టం అమలు వచ్చిన తర్వాత అసైన్డ్ భూములు కొనుగోలు చేసి వాటిని రాజధానికి ఇచ్చి ప్లాట్ లు పొందిన అందరికీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం అసైన్డ్ రైతులు తమ అవసరాల కోసం భూములు విక్రయించుకునేందుకు జీవో నెంబర్ 41ని విడుదల చేసింది.

దీని ప్రకారం అసైన్డ్ భూములు కొని ప్లాట్లు తీసుకున్న వారికి నోటీసులు ఇవ్వాలని సీఐడీ నిర్ణయం తీసుకుంది. రెండు రోజులుగా దాదాపు 50 మందికి నోటీసు వచ్చినట్లు సమాచారం మిగిలినవారికి వారం రోజులు నోటీసు ఇవ్వనున్నారు. అధికారంలోకి వచ్చాక జి.ఓ.నెం 41 రద్దు చేసి జి.ఓ.నెం. 316 విడుదల చేసిన వైసీపీ సర్కార్... అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనుగోలు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. నోటీస్ అందుకున్న వారంతా 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సిఐడి పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: