జమ్మూ కాశ్మీర్‌ లోని బందిపోరా జిల్లాలో భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌ కౌంటర్‌లో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ఉత్తర కాశ్మీర్‌లోని బంది పోరాలోని చాంద్‌జీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం అందుకున్న నేపథ్యంలో రాష్ట్రీయ రైఫిల్స్ (RR), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరియు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కార్డన్ - సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని రక్షణ అధికారులు వెల్లడించారు. భద్రతా దళాలు కూడా కాల్పులకు తగిన సమాధానమిచ్చాయి.  గుర్తు తెలియని ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి, అయితే అతడిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సంఘటనకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: