తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వీఆర్ఏలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో మొత్తం 13 జిల్లాల విఆర్ఏ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రభుత్వాలు వీఆర్ఏల తో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. అయితే వెట్టి చాకిరీ చేయించుకున్నా జీతాలు మాత్రం తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

2017 లో తమ ధర్నాకు మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తలరాత మారుస్తా అని చెప్పారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తమ తలరాతను మార్చక పోగా తలకిందులు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలు పట్టించుకోకుండా వాలంటీర్ల ద్వారా తమ వ్యవస్థను రద్దు చేయాలని చూస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. తమ పోరాటం పై ప్రభుత్వం స్పందించకుంటే ఇంకా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: