ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లో నియోజకవర్గాల పునర్విభజన విషయంలో స్పష్టత కోసం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్రం పెంచే అవకాశం ఉందని భావించినా సరే దీనిపై స్పష్టత ఇవ్వలేదు కేంద్రం. 2019 తర్వాత పెంచే అవకాశం ఉందని అంచనా వేసినా సరే అది కూడా జరగలేదు. అయితే ఇప్పుడు లోక్సభలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి దీనిపై క్లారిటీ ఇచ్చారు.

నియోజకవర్గాల పునర్విభజన అనేది ఏపీ విభజన చట్టం ప్రకారం ఎప్పుడు జరుగుతుంది అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించగా 2031 తర్వాత జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: