డిప్యూటి మేయర్ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంటుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేసారు. కాకినాడ నియోజకవర్గ టీడీపీ నేతలు కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి హాజరైన కొండబాబు మాట్లాడుతూ... కార్పొరేషన్ లో అత్యధిక మెజార్టీ టీడీపీకి ఇవ్వటం జరిగిందన్నారు. టీడీపీ  కార్పొరేటర్లు మాత్రమే వైసిపి ప్రభుత్వ వ్యతిరేక విధాన్నాం పై పోరాటం చేస్తున్నారు అని ఆయన స్పష్టం చేసారు.

అజెండాలో కొన్ని అంశాలను పెట్టడం లేదన్న కొండబాబు... చెత్త పై పన్ను వేయటం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు. ప్రజల పక్షాన టీడీపీ  కార్పొరేటర్లు పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే తీరుకు ప్రజలే కాదు అధికారులు కూడా భయపడుతున్నారని వ్యాపారాలు లేవ్ పన్నులు తగ్గించండి అని అప్పట్లో ద్వారంపూడి తన గోదాములకు 4 లక్షల రూపాయలు తగ్గించుకున్నారని ప్రస్తావించారు. అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కి టీడీపీ  భయపడే ప్రసక్తే లేదని ఇలాంటివి చాలా చూసామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: