దేశంలో న‌కిలీ యూనివ‌ర్సిటీలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. న‌కిలీ యూనివ‌ర్సిటీల వ‌ల్ల టాలెంట్ ఉన్న‌వారికి ఉద్యోగాల కొర‌త ఏర్పడి ఎలాంటి అర్హ‌త లేని వారికి అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. తాజాగా దేశంలో మొత్తం 24 న‌కిలీ యూనివ‌ర్సిటీలు ఉన్నాయ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. అంతే కాకుండా ఈ యూనివ‌ర్సిటీల్లో ఎక్క‌వ శాతం ఫేక్ యూనివ‌ర్సిటీలు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. న‌కిలీ యూనివ‌ర్సిటీల‌కు సంబంధించి పార్ల‌మెంట్ స‌మావేశాల  నేప‌థ్యంలో ప‌లువురు ఎంపీలు లోక్ స‌భ‌లో ప్ర‌శ్న‌లు వేశారు. 

దానికి స‌మాధానం ఇస్తూ కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర‌దాన్ స‌మాధానం ఇస్తూ..యూపీలో అత్య‌ధికంగా ఎనిమిది న‌కిలీ యూనివ‌ర్సిటీను యూజీసీ గుర్తించింద‌ని తెలిపారు. ఢిల్లీలో ఏడు, ప‌శ్చిమ బెంగాళ్ లో రెండు, ఒడిస్సాలో 2, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర, ఆంధ్ర‌ప్ర‌దేశ్, పుదుచ్చేరిలో ఒక్కో యూనివ‌ర్సిటీ ఉంద‌ని వెల్ల‌డించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: