మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి అరెస్ట్ లు మొదలయ్యాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దాదాపు రెండు నెలల నుంచి ఈ కేసు విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్న సిబిఐ అధికారులు ఎవరిని అదుపులోకి తీసుకుంటారు ఏంటీ అనే దానిపై కాస్త ఉత్కంట నెలకొంది. ఈ నేపధ్యంలో తాజాగా సునీల్ యాదవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిన్న గోవా లో అరెస్టు చేసిన సునీల్ గోవా కోర్టు లో సిబిఐ అధికారులు హాజరు పరిచారు. ట్రాన్సిట్ రిమాండ్ మీద కడప కు సునీల్ యాదవ్ ను సిబిఐ అధికారులు తరలిస్తున్నారు. రేపు ఉదయం కడప కోర్టులో సునీల్ యాదవ్ ను హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అనంతరం కడప జైలుకు తరలించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిపై సిబిఐ నుంచి ఏ విధమైన స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: