గత కొన్ని రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రైం నేరాళ్ళు ఎక్కువయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో ఒక ఘటన చోటు చేసుకుంది. తెలుగు మాట్రిమోనియల్ లో యువతిని పరిచయం చేసుకొని 10 లక్షల రూపాయల మేర ఒక నైజీరియాకు చెందిన వ్యక్తి దండుకున్నాడు. నైజీరియన్ ను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 బేగంపేటకు చెందిన ఓ యువతి తెలుగు మ్యాట్రిమోనీ లో తన ప్రొఫైల్ ని అప్డేట్ చేయగా...  ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ తెలుగు మ్యాట్రిమోనీ లో యువతి ప్రొఫైల్ చూసి తన ప్రొఫైల్ నచ్చింది అని వల వేయడం మొదలుపెట్టాడు.  తాను  యుఎస్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నట్లు పరిచయం పెంచుకుని ఆ తర్వాత ఆ యువతికి గిఫ్ట్ పంపించాను అని చెప్పి మోసం చేసాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారుల అని చెప్పి మీకు గిఫ్ట్ రూపం లో డాలర్స్ వచ్చాయని అది చట్టవిరుద్ధమని కస్టం చార్జెస్ మరియు పలు చార్జీల కింద కట్టాలని ఆ యువతి దగ్గర 10 లక్షల రూపాయల మేర వసూలు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

fb