దేవినేని ఉమ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాద ప్రతివాదాలు విన్న కోర్ట్ కేసును రేపటికి వాయిదా వేసింది. దేవినేని ఉమా పై పిర్యాదు చేసిన వ్యక్తి వసంత్ కృష్ణప్రసాద్ సన్నిహత సహచరుడు పాలడుగు దుర్గాప్రసాద్ డ్రైవర్ కాగా, అతడిని కులం పేరుతో దూషించలేదని ఉమా తరపు న్యాయవాదులు వాదించారు. కేవలం రాజకీయా కక్ష్యలతోనే అక్రమ కేసులు పెడుతున్నారని, అలాగే ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పుడు హత్యాయత్నం సెక్షన్లు ఎలా పెడతారంటూ అడ్వొకేట్ ని ఉమా న్యాయవాది ప్రశ్నించారు. ఈ కేసులో పెట్టిన మిగతా నిందితులపై ఎటువంటి ఆరోపణలు లేవని పేర్కొన్న పోసాని  ఇక కేసు లో ఇంకా కొంత మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, అందుకని ఉమ కు బెయిల్ ఇవ్వడం మంచి పరిణామం కాదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: