మంత్రి రాఘు రామ కృష్ణ రాజు హత్యా రాజకీయాలు మానుకోవడం మంచిది అని హెచ్చరిస్తూనే గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకొవాలని కోరారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. "నేడు ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంటు సెంట్రల్ హాల్ లో సభ్యసమాజం తలదించుకునే రీతిలో అసభ్యకరమైన పదాలతో నన్ను బూతులు తిడుతూ నా అంతు చుస్తానంటూ బెదిరించడం జరిగింది. ఈ విషయంపై గౌరవ లోక్ సభ స్పీకర్ గారికి వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయగా తక్షణమే చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని నేను అంత తేలికగా వదిలేయాలని అనుకోవడం లేదు ఒక పార్లమెంటు సభ్యునిపై పార్లమెంటు సెంట్రల్ హాల్ లోనే ఇలా అసభ్య పదజాలంతో దాడి చేయడం వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి మరియు కేంద్ర హోంమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు వెనుకాడను. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలచుకున్నాను, ఇటువంటి హత్యా బెదిరింపులు మానుకుంటే మంచిది. జరిగిన ఈ సంఘటన వెనుక ఒకవేళ నిజంగా మీ ప్రమేయం లేకపోతే హిందూపూర్ పార్లమెంటు సభ్యడు గోరంట్ల మాధవ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" అంటూ ట్వీట్ల ద్వారా అసలు విషయాన్ని వెల్లడించాడు. మరి దీనికి అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: