గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్ల తర్వాత ప్రొబేషన్ పీరీయడ్ దక్కాలంటే పరీక్షలు పాస్ అవ్వాల్సిందే అంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలను వెనక్కి తీసుకుంది. సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ బేస్ డ్ అసెస్మెంట్ సిస్టమ్... సీబీఏఎస్ పరీక్షలు లేవని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్గత డిపార్ట్ మెంటల్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించేది లేదన్నారు అజయ్ జైన్. ప్రొబేషన్ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి. అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్... ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే డిపార్ట్ మెంటల్ పరీక్షలు మాత్రమే ఉంటాయన్నారు అజయ్ జైన్. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటనతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. కేవలం ఏపీపీఎస్సీ పరీక్షలు పాసైతే చాలు. ప్రొబేషన్ పీరీయడ్ లోకి వెళ్లిపోతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: