జస్టీస్ కనగరాజు నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సస్పెండ్ చేస్తూ షాక్ ఇచ్చింది. పోలీసు కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టీస్ కనగరాజు నియామకాన్ని హైకోర్టులో న్యాయవాది పారా కిషోర్ సవాల్ చేయగా నేడు హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పులు, నియామక నిబంధనలకు విరుద్దంగా జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు... ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

కనగరాజు నియామకం చెల్లదని ప్రాధమికంగా అభిప్రాయపడింది ఏపీ హైకోర్ట్. పిటీషనర్ తరపున వాదనలును న్యాయవాది ఇంద్రనీల్ బాబు వినిపించారు. కాగా గత ఏడాది ఏపీ ఎన్నికల కమీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పక్కకు తప్పించి కనగరాజ్ ను  రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా ఆ నియామకాన్ని కూడా రద్దు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap