మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయింది,ఈ ఘటనలో  13 మంది కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున 4.40 గంటలకు జరిగింది. అగ్నిమాపక దళ అధికారి ప్రకారం, 13 మంది తీవ్ర గాయాలు అయినా వారిని అక్కడ నుండి తరలించారు మరియు ప్రాథమిక రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సమీప ఆసుపత్రికి తరలించారు. వారందరికీ స్వల్ప గాయాలయ్యాయని అంటుండగా తీవ్ర గాయాలే అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి రెస్క్యూ పని జరుగుతోంది మరియు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము, దాని కోసం ఇండియా హెరాల్డ్ కు కనెక్ట్ అయి ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: