హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు స్వాతంత్ర్య వచ్చిన రోజు సెప్టెంబర్ 17 అని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని అన్నారు. సెప్టెంబర్ 17 పై బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో చర్చ పెట్టండి అందుకు కాంగ్రెస్ సహకరిస్తుందన్నారు రేవంత్, ఇక 1937 నుంచి 1947 వరకు రజాకార్లకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా నిజాం నవాబు తెలంగాణ ను స్వాతంత్ర్య భారతదేశంలో విలీనం చేశారని కానీ కాంగ్రెస్ నేతల ఫోటోలు పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని ఇప్పటి నేతలు చూస్తున్నారని ఆయన విమర్శించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: