హైదరాబాద్ తెలంగాణ భవన్ లో విలీన దినోత్సవ వేడుకలు జరిగాయి, జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేకే అనంతరం నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. ఈ విషయంలో ఎటువంటి వివాదాలు అవసరం లేదు...సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమేనని, ఇవాళ సంతోషకరమైన రోజు అని అన్నారు. ఆగస్టు 15 న నాడు మనకు స్వాతంత్ర్యం రాలేదు, మనకు స్వాతంత్ర్యము కోసం ఏడాది ఆగామని, ఇవాళ మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవం  అని అన్నారు. సెప్టెంబర్ 17 పై వివాదాలు అనవసరం  అని పేర్కొన్న ఆయన భారత్ లో మనము కూడా విలీనం కావాలని కోరుకున్నామని అది ఈ రోజున జరిగిందని అన్నారు. ఇక ఈరోజును విమోచన దినోత్సవం అని కాంగ్రెస్, బీజేపీలు అంటుంటే అధికార పార్టీ మాత్రం విలీన దినం అంటోంది, ఎంఐఎం తో మిత్రుత్వం పెట్టుకుని ఇలా చేస్తుందని కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk